Telugu Condolence Messages

శ్రద్ధాంజలి & సంతాప సందేశాలు తెలుగులో

ప్రియమైన వారిని కోల్పోయిన వేళ సరైన మాటలు దొరకడం కష్టం. సంతాప సందేశాలు, శ్రద్ధాంజలి poster wording, కర్మ కార్యక్రమాల ఆహ్వానం — గౌరవంగా, సరళంగా.

Poster Kaaran mascot

1. సంతాప సందేశాలు (కుటుంబానికి పంపడానికి)

బాధలో ఉన్న కుటుంబానికి ఓదార్పుగా:

[పేరు] గారి మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
🎨 Poster గా చేయండి
వారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఈ కష్ట సమయంలో భగవంతుడు మీకు ధైర్యం ఇవ్వాలి. ఓం శాంతి. 🙏
🎨 Poster గా చేయండి
వారి మంచితనం, ఆప్యాయత మా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలి.
🎨 Poster గా చేయండి
మీ బాధలో మేము కూడా పాలుపంచుకుంటున్నాం. ఏ సహాయం కావాలన్నా మేము ఉన్నాం. ప్రగాఢ సానుభూతి.
🎨 Poster గా చేయండి

2. శ్రద్ధాంజలి Poster Wording

ఫోటోతో పెట్టే poster / banner కోసం:

శ్రద్ధాంజలి శ్రీ / శ్రీమతి [పేరు] జననం: [తేదీ] | మరణం: [తేదీ] మీరు భౌతికంగా దూరమైనా మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. అశ్రు నివాళులతో — [కుటుంబ సభ్యుల పేర్లు]
🎨 Poster గా చేయండి
అశ్రు నివాళి మా ప్రియమైన [సంబంధం — నాన్న / అమ్మ / తాత] గారు [పేరు] [తేదీ] న పరమపదించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ — [కుటుంబం పేరు]
🎨 Poster గా చేయండి
ప్రథమ వర్ధంతి నివాళి స్వర్గీయ శ్రీ [పేరు] [తేదీ] — [తేదీ] మీరు భౌతికంగా మమ్మల్ని విడిచి ఏడాది గడిచినా, మీ జ్ఞాపకాలు మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. — [కుటుంబ సభ్యులు]
🎨 Poster గా చేయండి

3. దశదిన కర్మ / పెద్ద కర్మ ఆహ్వానం

కర్మ కార్యక్రమాలకు బంధువులను ఆహ్వానించడానికి:

దశదిన కర్మ / వైకుంఠ సమారాధన మా [సంబంధం] స్వర్గీయ శ్రీ / శ్రీమతి [పేరు] గారు [తేదీ] న పరమపదించారు. వారి దశదిన కర్మ (పెద్ద కర్మ) కార్యక్రమం [తేదీ], [వారం] న [చిరునామా] లో జరుగును. బంధుమిత్రులు విచ్చేసి వారి ఆత్మశాంతికి ప్రార్థించగలరని మనవి. — [కుటుంబ సభ్యుల పేర్లు] | 📞 [ఫోన్ నంబర్]
🎨 Poster గా చేయండి

4. పంపే ముందు చూసుకోవాల్సినవి

పేరు & తేదీలుపూర్తి పేరు, జనన మరణ తేదీలు ఒకసారి కుటుంబంతో check చేయండి.
ఫోటోస్పష్టమైన, గౌరవంగా ఉండే ఫోటో ఎంచుకోండి.
సరళమైన రంగులుతెలుపు, నలుపు, బూడిద వంటి శాంతమైన రంగులు వాడండి.
కార్యక్రమ వివరాలుకర్మ ఆహ్వానం అయితే తేదీ, సమయం, చిరునామా, ఫోన్ నంబర్.

ఈ వరుసలను Template లో పెట్టండి

నచ్చిన design పై click చేస్తే Editor లో తెరుచుకుంటుంది — పేరు, ఫోటో మార్చి download చేసుకోండి.

శ్రద్ధాంజలి Poster Templates - te_cr190_tmcf1u శ్రద్ధాంజలి Poster Templates - te_cr130_tlv330 శ్రద్ధాంజలి Poster Templates - te_rip_1781554524694_c6fce0 శ్రద్ధాంజలి Poster Templates - te_cr129_tlv345 శ్రద్ధాంజలి Poster Templates - te_0js6q8 శ్రద్ధాంజలి Poster Templates - te_u5tj0z

అన్ని శ్రద్ధాంజలి Poster Templates చూడండి →

తరచుగా అడిగే ప్రశ్నలు

శ్రద్ధాంజలి poster లో ఏం రాయాలి?

"శ్రద్ధాంజలి" లేదా "అశ్రు నివాళి" శీర్షిక, పేరు, జనన మరణ తేదీలు, ఒక చిన్న నివాళి వాక్యం, కుటుంబ సభ్యుల పేర్లు.

సంతాప సందేశం తెలుగులో ఎలా పంపాలి?

పైన ఉన్న సందేశాలలో సరిపోయేది ఎంచుకుని, పేరు మార్చి పంపండి. చిన్నగా, ఆప్యాయంగా ఉంటే చాలు.

శ్రద్ధాంజలి poster free గా చేయవచ్చా?

అవును. PosterKaaran లో శ్రద్ధాంజలి templates ఉన్నాయి — ఫోటో, పేరు, తేదీలు మార్చి download చేసుకోండి.

ఇప్పుడే మీ తెలుగు poster తయారు చేయండి

Free templates, తెలుగు fonts, తెలుగులో type చేసే సౌకర్యం — అన్నీ ఒకే చోట.

శ్రద్ధాంజలి Poster Templates →